నటీనటులు : రవితేజ, శ్రుతి హాసన్, సముథ్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్, అప్సర రాణి, రవి శంకర్ దర్శకత్వం : గోపీచంద్ మలినేని నిర్మాతలు : ఠాగూర్ మధు సంగీతం : థమన్ సినిమాటోగ్రఫర్ : జి. కె. విష్ణు ఎడిటర్ : నవీన్ నూలి రవితేజ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం క్రాక్. లాక్డౌన్ తర్వాత వచ్చిన మొదటి పెద్ద హీరో చిత్రం ఇది. ఇది దాని హైప్‌కు అనుగుణంగా ఉందో లేదో చూద్దాం. కథ : వీర శంకర్ (రవితేజ) ఒక క్రేజీ పోలీసు, వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేరస్థులతో తన శైలిలో వీర శంకర్ వారితో పెట్టుకుంటాడు. వారిలో, కటారి (సముద్రఖని ) అత్యంత శక్తివంతమైనవాడు. పైగా అతను శంకర్‌పై తిరుగుబాటు చేయడానికి చాల బలంగా ప్రయత్నిస్తాడు. హీరోని చంపడానికి అతను ఎంత దూరమైనా వెళ్తాడు ? మరి కటారి, వీర శంకర్ ల మధ్య అసలు ఏమి జరిగింది ? చివరకు వీరశంకర్ ఏమి చేశాడు ? అనేది మిగిలిన సినిమా మొత్తం కథ. రవితేజ వింటేజ్ రవితేజ లా మారిపోయి విక్రమార్కుడు తర్వాత ఆ రేంజ్ లో ఫీల్ అయ్యే పవర్ ఫుల్ రోల్ తో మెస్మరైజ్ చేశాడు… ఇక శ్రుతిహాసన్ రోల్ మొదట్లో కొంచం బోర్ కొట్టించినా సెకెండ్ ఆఫ్ లో ఓ ట్విస్ట్ అండ్ మాస్ మూమెంట్స్ తో తను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక విలన...