కొత్త సంవత్సరం జోష్ మీదున్న పవర్ స్టార్
లాక్ డౌన్ తరవాత లేట్ గా సెట్ లో అడుగు పెట్టిన పవన్ వకీల్ సాబ్ కంప్లీట్ చేసారు. అయితే కొత్త ఏడాదిలో మాత్రం సీన్ అలా ఉండదని ఇప్పటి నుంచే హింట్ ఇస్తున్నారు పవన్. ఈ మధ్యే మలయాళ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియం’ రీమేక్‌ను స్టార్ట్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈనెల్లోనే స్టార్ట్ చేస్తున్నారు. పవన్ పోలీస్ క్యారెక్టర్‌లో నటిస్తున్న ఈ సినిమాలో రానా మరో హీరోగా నటిస్తున్నారు. ఈ మూవీతో పాటు మరో సినిమాలో కూడా ప్యారలల్‌గా నటించేందుకు రెడీ అవుతున్నారు పవన్.
మల్టీ స్టారర్‌తో పాటు క్రిష్ డైరెక్ట్ చేస్తున్న సినిమాను కూడా జనవరి ఫస్ట్ వీక్‌లోనే సెట్స్ మీదకు తీసుకెళ్లాలన్నది పవన్ ప్లాన్. లాక్‌డౌన్‌కు ముందే ఈ సినిమాకు సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తయ్యింది. ఇప్పుడు మిగతా భాగాన్ని స్పీడ్‌గా కంప్లీట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇలా ఒకేసారి రెండు సినిమాలు పూర్తి చేస్తుండటం.. వకీల్ సాబ్ రిలీజ్‌కు రెడీ అవుతుండటంతో ఈ ఏడాది పవన్, 3 సినిమాలు రిలీజ్ చేస్తారని హ్యాపీగా ఫీలవుతున్నారు పవర్ స్టార్ ఫ్యాన్స్. అన్నట్లు… న్యూ ఇయర్ సందర్భంగా హరీష్ శంకర్, బండ్ల గణేష్ కూడా పవన్‌ని కలిశారు. సో వాటి ప్రీ ప్రొడక్షన్ కూడా ఈ ఇయరే స్టార్ట్ అవుతుందన్నది బోనస్ న్యూస్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి