క్రాక్ మూవీ రివ్యూ…పోతరాజు వీర శంకర్ మాస్ జాతర





నటీనటులు : రవితేజ, శ్రుతి హాసన్, సముథ్రఖని, వరలక్ష్మి శరత్‌కుమార్, అప్సర రాణి, రవి శంకర్

దర్శకత్వం : గోపీచంద్ మలినేని

నిర్మాత‌లు : ఠాగూర్ మధు

సంగీతం : థమన్

సినిమాటోగ్రఫర్ : జి. కె. విష్ణు

ఎడిట‌ర్‌ : నవీన్ నూలి


రవితేజ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం క్రాక్. లాక్డౌన్ తర్వాత వచ్చిన మొదటి పెద్ద హీరో చిత్రం ఇది. ఇది దాని హైప్‌కు అనుగుణంగా ఉందో లేదో చూద్దాం.

 

కథ :

వీర శంకర్ (రవితేజ) ఒక క్రేజీ పోలీసు, వేర్వేరు నగరాల్లో ముగ్గురు నేరస్థులతో తన శైలిలో వీర శంకర్ వారితో పెట్టుకుంటాడు. వారిలో, కటారి (సముద్రఖని ) అత్యంత శక్తివంతమైనవాడు. పైగా అతను శంకర్‌పై తిరుగుబాటు చేయడానికి చాల బలంగా ప్రయత్నిస్తాడు. హీరోని చంపడానికి అతను ఎంత దూరమైనా వెళ్తాడు ? మరి కటారి, వీర శంకర్ ల మధ్య అసలు ఏమి జరిగింది ? చివరకు వీరశంకర్ ఏమి చేశాడు ? అనేది మిగిలిన సినిమా మొత్తం కథ.

రవితేజ వింటేజ్ రవితేజ లా మారిపోయి విక్రమార్కుడు తర్వాత ఆ రేంజ్ లో ఫీల్ అయ్యే పవర్ ఫుల్ రోల్ తో మెస్మరైజ్ చేశాడు… ఇక శ్రుతిహాసన్ రోల్ మొదట్లో కొంచం బోర్ కొట్టించినా సెకెండ్ ఆఫ్ లో ఓ ట్విస్ట్ అండ్ మాస్ మూమెంట్స్ తో తను కూడా బాగా ఆకట్టుకుంది. ఇక విలన్స్ లో సముద్రఖని ఆకట్టుకున్నా మరీ పవర్ ఫుల్ రోల్ కాదు. ఇక వరలక్ష్మీ రోల్ గురించి బాగా టాక్ వచ్చినా సినిమాలో ఏమి లేదు…



మిగిలిన నటీనటులు ఉన్నంతలో మెప్పించాగా… సంగీతం అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో తమన్ మెస్మరైజ్ చేశాడు, సాంగ్స్ కొన్ని పర్వాలేదు అనిపించినా రెండు మూడు పాటలు బాగా మెప్పించాయి కానీ బ్యాగ్రౌండ్ స్కోర్ కొట్టాడు… మాస్ మహారాజ్ కి బెస్ట్ ఎలివేషన్స్ అనిపించే రేంజ్ లో మాస్ బ్యాగ్రౌండ్ స్కోర్ తో అక్కడక్కడా వీక్ అనుకున్న సీన్స్ ని కూడా తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేశాడు.

ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పర్వాలేదు అని చెప్పాలి, సినిమా టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పట్టినా తర్వాత ఫస్టాఫ్ మొత్తం అదిరిపోతుంది, సెకెండ్ ఆఫ్ కొంచం స్లో అవుతుంది అనుకున్న టైం లో మాస్ సాంగ్ లేదా సాలిడ్ ఫైట్ తో బాలెన్స్ చేశారు. ఇక సినిమాటోగ్రఫీ సినిమాకి…

మరో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.. కమర్షియల్ మూవీస్ లో ఈ రేంజ్ క్వాలిటీ సినిమాటోగ్రఫీ చాలా రేర్ అని చెప్పాలి. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక గోపీచంద్ మలినేని డైరెక్షన్ విషయానికి వస్తే అనుకున్న కథ పాయింట్ లో పెద్దగా ఏమి లేదు కానీ రవితేజ రోల్ ని తీర్చిదిద్దిన విధానం మాస్ ఎలిమెంట్స్ లాంటివి అద్బుతంగా తెరకెక్కించాడు. కానీ కథ పాయింట్ చాలా తిన్ లైన్ అవ్వడం…

టేక్ ఆఫ్ అవ్వడానికి కొంచం టైం పట్టడం, సెకెండ్ ఆఫ్ లో కొంచం స్లో అయిన ఫీలింగ్ అక్కడక్కడా కలిగించడం చిన్న చిన్న మైనస్ పాయింట్స్. కానీ అవేవి లెక్క చేయనివ్వకుండా రవితేజ రోల్ మెప్పించేలా డైరెక్షన్ తో అదరగొట్టేశాడు గోపీచంద్… మొత్తం మీద సినిమా రవితేజకి బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ…

Final Verdict : ఇది …పోతరాజు వీర శంకర్ మాస్ జాతర!!

Rating : 3.25/5



కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Oo Antava Song Lyrics in Telugu & English – PUSHPA (Samantha,Alluarjun)

నేను వైసీపీ కార్యకర్తనే అంటున్న రాపాక

కొత్త సంవత్సరం జోష్ మీదున్న పవర్ స్టార్