Yash: రాకీ భాయ్ హీరోనా? విలనా?.. జనవరి 8న KGF అదిరిపోయే సర్‌ప్రైజ్

 ‘‘మంచి చేసేవాడు హీరో, చెడు చేసేవాడు విలన్ అయితే రెండూ చేసేవాడు హీరోనా? విలనా?’’.. ‘కె.జి.యఫ్’ శకం ముగిసే సరికి రాకీ భాయ్ హీరో అవుతాడా? విలన్ అవుతాడా? ఈ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకబోతోంది. ‘కె.జి.యఫ్’ శకం ఎలా ముగియబోతోందో రుచి చూపించడానికి ముహూర్తం ఖరారైంది. జనవరి 8న ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’ టీజర్ వచ్చేస్తుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ సోమవారం ప్రకటించింది.



కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ‘కె.జి.యఫ్ చాప్టర్ 1’ పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీనికి కొనసాగింపుగా వస్తోన్న ‘కె.జి.యఫ్ చాప్టర్ 2’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా భారీగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

Oo Antava Song Lyrics in Telugu & English – PUSHPA (Samantha,Alluarjun)

నేను వైసీపీ కార్యకర్తనే అంటున్న రాపాక

కొత్త సంవత్సరం జోష్ మీదున్న పవర్ స్టార్