కొత్త జీవితం లో అడుగు పెట్టిన గాయని సునీత
మధుమైన గాత్రంతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న గాయని సునీత కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. సింగిల్ పేరెంట్ గా పిల్లల బాధ్యతలు చూసుకుంటున్న సునీత వివాహ బంధంలోకి అడుగు పెట్టారు. మ్యాంగో మీడియా గ్రూప్ హెడ్ రామ్ వీరపనేనినితో నిశ్చితార్ధం అయిన సంగతి తెలిసిందే. అయితే నేడు సునీత వివాహం చేసుకుంది. సంప్రదాయబద్ధంగా పెళ్లి కూతురు అయ్యింది. ఈ క్రమంలో ఆమె ఇద్దరు పిల్లలతో కలిసి తన ఆనందాన్ని పంచుకుంది.
సునీతకు 19 సంవత్సరాల వయసులో వివాహం జరిగింది. చిన్న వయసులోనే ఇద్దరు పిల్లలు పుట్టారు. ఆ తర్వాత భర్తతో మనస్పర్థాలు తలెత్తడంతో ఆయనతో సునీత విడాకులు తీసుకున్నారు. అప్పటి నుంచి కుటుంబ బాధ్యతలను తనే చూసుకుంటూ పిల్లలతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నారు.
సునీత పెళ్లి వైభవంగానే జరిగిపొయింది. సింగర్ సునీత ఈ సాయంత్రం హైద్రాబాద్లోని ఓ గుళ్లో పెళ్లి చేసుకున్నారు. వందల ఏళ్ళ చరిత్ర కలిగిన పురాతన శ్రీరామచంద్రస్వాముల వారి గుళ్లో సునీత రెండో పెళ్ళి జరిగింది. డిజిటల్ మీడియా కంపెనీ ఓనర్ రామ్ వీరపనేనితో ఆమె పెళ్లి జరుగుతుండేసరికి.. అందరిలో ఆమె పెళ్లి పట్ల ఆసక్తి రెట్టింపు అయింది.
ఇక ఇప్పటికే సునీత, రామ్ తమ స్నేహితులకు, ఇండస్ట్రీ ప్రముఖులకు విందు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకే పెళ్ళికి కేవలం కుటుంబ సభ్యులు, కొద్దిమంది కామన్ ఫ్రెండ్స్ ను మాత్రమే ఆహ్వానించినట్లు తెలుస్తోంది. సునీత పిల్లల ఇద్దరు ముందుండి ఆమెకు పెళ్లిని ఘనంగా జరుపుతున్నారు. ఇక పెళ్లి తరువాత సునీత దంపతులు హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్ళబోతున్నారని తెలుస్తోంది
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి